మహేష్ బాబును కలిసిన ప్రభాస్ పెద్దమ్మ వీడియో వైరల్.. కారణం అదేనా?

by Disha Web Desk 6 |
మహేష్ బాబును కలిసిన ప్రభాస్ పెద్దమ్మ వీడియో వైరల్.. కారణం అదేనా?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో సరికొత్తగా కనిపించేందుకు పలు జాగ్రత్తలు పాటిస్తున్నాడు. దీంతో గత కొద్ది కాలంగా అన్నింటికీ దూరంగా ఉంటూ తన లుక్స్ బయటకు రాకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు. దీని నుంచి ఎలాంటి అప్డేట్ రానప్పటికీ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, మహేష్ బాబును ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కలిసింది. సూపర్ స్టార్ తన ఫ్యామిలీతో కలిసి ఓ పెళ్లికి వెళ్లగా.. అక్కడ శ్యామలా దేవి ఆయనను చూసి దగ్గరకు వచ్చి అప్యాయంగా పలకరించింది. అలాగే నమ్రతను ప్రేమగా హత్తుకుంది. సితార తలపై చేయి పెట్టి మరీ ఆశీర్వదించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఏదో కారణం ఉండే ఉంటుంది.. అందుకే ప్రభాస్ పెద్దమ్మ సూపర్ స్టార్‌ను కలిసిందని నెట్టింట చర్చలు మొదలెట్టారు.

Next Story