- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమానాయాన భద్రత, దర్యాప్తుకు నిధులేవీ
ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఉన్న భారత్‌లో భద్రతా మౌలిక సదుపాయాలకు, ప్రమాద దర్యాప్తు సామర్థ్యాలకు తగినంత బడ్జెట్ కేటాయింపులు లేవని 2025 మార్చి 25న రాజ్యసభలో పర్యాటక, రవాణా శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సమర్పించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఉన్న భారత్‌లో భద్రతా మౌలిక సదుపాయాలకు, ప్రమాద దర్యాప్తు సామర్థ్యాలకు తగినంత బడ్జెట్ కేటాయింపులు లేవని 2025 మార్చి 25న రాజ్యసభలో పర్యాటక, రవాణా శాఖకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సమర్పించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) లకు తక్కువగా నిధులు కేటాయించడాన్ని విమర్శించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి DGCAకి రూ. 30 కోట్లు, AAIBకి రూ. 20 కోట్లు, BCASకి రూ. 15 కోట్లు మాత్రమే కేటాయించారు. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరగ్గా విమానయాన భద్రతకు సంబంధించిన నిధుల లోపాలను స్పష్టంగా ఎత్తిచూపింది.
ఎయిరిండియా ప్రమాదంతో తీవ్రమైన చర్చ
అహ్మదాబాద్‌లో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఒక మెడికల్ కాలేజీ క్యాంపస్‌పై కూలిపోయి మంటల్లో చిక్కుకుని 270 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో AAIB దర్యాప్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 నుంచి 2022లో 147కు పెరిగింది. 2025 నాటికి ఈ సంఖ్యను 220కు పెంచాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ పెరుగుదలకు అనుగుణంగా భద్రతా మౌలిక వసతులు ప్రమాద దర్యాప్తు సామర్థ్యాలను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది.DGCAకి అత్యధికంగా రూ. 30 కోట్లు కేటాయించిన విషయాన్ని పునఃసమీక్షించాలని సూచించింది. DGCA విమానయాన సంస్థల నియంత్రణను పర్యవేక్షించి, వాటి ప్రమాణాలను నిర్ధారించే బాధ్యత వహిస్తుంది. UDAN పథకం కింద చిన్న పట్టణాలకు విమాన సౌకర్యాలు పెరుగుతున్న క్రమంలో భద్రతా మౌలిక సదుపాయాలు సామర్థ్యాలను అనుగుణంగా విస్తరించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. DGCA, BCAS, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంస్థల్లో మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. DGCAలో 53 శాతం ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ విమానయాన భద్రతను సమర్థవంతంగా నిర్వహించడం సవాలే అని తేల్చిచెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.






