- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాయిటర్స్ ’ను బ్యాన్ విధించమని ‘ఎక్స్’ కు తాము చెప్పలేదు: కేంద్రం
ఇండియాలో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ అధికారిక ఎక్స్ ఖాతా బ్లాక్ కావడంపై ఏర్పడిన గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియాలో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ అధికారిక ఎక్స్ ఖాతా బ్లాక్ కావడంపై ఏర్పడిన గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. భారత్ చట్టపరమైన ఆంక్షలకు అనుగుణంగా రాయిటర్స్ ఖాతా నిలిపివేశామని ‘ఎక్స్’ సందేశాన్ని విడుదల చేసింది. దీంతో ఐటీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పందించారు. ఇటీవలి కాలంలో రాయిటర్స్ ఖాతాను బ్లాక్ చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి చట్టపరమైన ఆర్డర్స్ జారీ చేయలేదని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఎర్పడిన సమస్యను పరిష్కరించేందుకు ఎక్స్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
పొరపాటుగా పాత ఆర్డర్ ను అమలు చేసి
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో జారీ చేసిన ఒక పాత ఆర్డర్ ని ‘ఎక్స్’ పొరపాటుగా ఇప్పుడు అమలు చేసినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం రాయిటర్స్ అనుబంధ హ్యాండిళ్లు , టెక్ న్యూస్, ఫ్యాక్ట్ చెక్, ఆసియా, చైనా మొదలైనవి భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రధాన అకౌంట్, (Reuters World) ఖాతాలు మాత్రం వినియోగదారులకు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎక్స్ ను సంప్రదించి బ్లాక్ ను తొలగించేందుకు చర్చలు జరుపుతోంది.






