- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New Year Celebrations 2026 : నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికిన ఆక్లాండ్
న్యూజిలాండ్లోని ఆక్లాండ్ లో అట్టహాసంగా న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. స్కై టవర్ ఫైర్ వర్క్స్ అందరినీ కనువిందు చేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల కోసం ఆనందంగా ఎదురుచూస్తుండగా.. కిరిబాటి ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కిరిబాటిలో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమైన గంట తర్వాత న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో అట్టహాసంగా కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. అద్భుతమైన బాణసంచా ప్రదర్శనతో వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఐకానిక్ స్కై టవర్ పై ఫైర్ క్రాకర్స్ వెలుగుల మధ్య న్యూ ఇయర్ కు ఆక్లాండ్ ప్రజలు ఆహ్వానం పలికారు. స్కై టవర్ ఫైర్ వర్క్స్ ప్రజలను సందర్శకులను ఆకట్టుకున్నాయి. 5 నిమిషాలపాటు జరిగిన ఫైర్ వర్క్స్ ప్రదర్శనలో 787 అడుగుల ఎత్తులో ఉన్న స్కై టవర్ పై 3500 క్రాకర్స్ ను కాల్చారు. హార్బర్ బ్రిడ్జి వద్ద కూడా నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్, ఫైర్ వర్క్స్ షోలు ఆకట్టుకున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందర్శకులు కేరింతలు కొట్టారు. 2025కు వీడ్కోలు పలికి ఒకరినొకరు హత్తుకుని హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. కాగా.. అక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉండటంతో న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్ అంతా చిన్న చిన్న కమ్యూనిటీ కార్యక్రమాలు రద్దయ్యాయి.






