- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eggs Smuggling : అమెరికాలో నయా స్మగ్లింగ్.. డ్రగ్స్, బంగారం కంటే మించి పోయిందిగా..!
అగ్రరాజ్యం అమెరికా(America)లో నయా స్మగ్లింగ్ మొదలైంది.

దిశ, వెబ్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా(America)లో నయా స్మగ్లింగ్ మొదలైంది. సాధారణంగా స్మగ్లింగ్ అంటే.. డ్రగ్స్, బంగారం, డైమండ్స్ ఇలా పలురకాల వస్తువులను ఒక దేశం నుంచి మరొక దేశంలోకి అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. కాని అమెరికాలో ఈమధ్య కోడిగుడ్ల అక్రమ రవాణా(Eggs Smuggling) దందా కొనసాగుతోంది. బర్డ్ ఫ్లూ(Bird Flu)ఎఫెక్ట్ తో పౌష్టికాహారమైన కోడి గుడ్లు అమెరికా ప్రజలకు ప్రస్తుతం అందని ద్రాక్షలా మారాయి. అమెరికన్లు కోడి గుడ్లను తమ ఆహారంలో ఎక్కువగా వినియోగిస్తారు. అలాంటిది ఆ దేశంలో బర్డ్ ప్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. రెండుమూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కోడి గుడ్ల కొరతకు దారితీసింది. దీంతో కోడి గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లో డజన్ కోడి గుడ్ల ధర 9 నుంచి 10 డాలర్లు పలుకుతుంది.
అయితే, ఈ ఏడాది చివరి నాటికి గుడ్ల ధరలు మరో 50శాతం పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే డజన్ కోడిగుడ్ల ధర భారత కరెన్సీలో రూ. 1200 నుంచి రూ. 1300కు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అమెరికాలో కోడి గుడ్ల కొరతను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కెనడా నుంచి అమెరికాలోకి కోడి గుడ్లను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ దందా ఏ స్థాయికి చేరిందంటే.. డ్రగ్స్ కంటే 10 రెట్లు అదనంగా కోడి గుడ్ల దందా కొనసాగుతుందట. గుడ్లు సంక్షోభం నేపథ్యంలో అమెరికాలోని కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారంకు తెరతీశారు. దీంతో కోడి పెట్టలకు డిమాండ్ పెరిగింది. పలు కంపెనీలు ఆరు నెలల ప్రాతిపదికన కోడి పెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీసం అద్దె ప్యాకేజీ 300 డాలర్ల నుంచి 310 డాలర్ల వరకు ఉంది.






