Modi Effect: వైట్‌హౌస్‌లో మెలోని ‘నమస్తే’ మోడీ ఎఫెక్ట్ అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్

by Ramesh Naini |

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారత ప్రధాని నరేంద్ర మోడీల పేర్లు మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Modi Effect: వైట్‌హౌస్‌లో మెలోని ‘నమస్తే’ మోడీ ఎఫెక్ట్ అంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Georgia Meloni) భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Modi)ల పేర్లు మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. తాజాగా (White House) వైట్‌హౌస్ సమావేశానికి హాజరైన ప్రధాని జార్జియా మెలోని భారతీయ సంప్రదాయం ప్రకారం నమస్తే అంటూ పలకరించి అందరి దృష్టిని ఆకర్షించారు. వివరాల్లోకి వెళితే.. రష్యాతో శాంతి చర్చల్లో భాగంగా సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీతో భేటీ అయిన విషయం తెలిసిందే. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి యూరోపియన్ నాయకులు కూడా హాజరయ్యారు. అందులో భాగంగా ఇటలీ ప్రధాని మెలోని కూడా హాజరయ్యారు. మీటింగ్‌లో పాల్గొనేందుకు ప్రధాని మెలోని వైట్‌హౌస్‌కు చేరకున్నప్పుడు ట్రంప్ అధికారుల సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఆమె ట్రంప్ సీనియర్ సహాయకురాలికి మొదట షేక్‌హ్యాండ్స్‌తో పలకరించారు.

అనంతరం మెలోని నవ్వుతూ నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రధాని మోడీ ఎఫెక్ట్ (Modi Effect) అంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మెలోని గతంలోనూ జూన్ 2024 లో జీ 7 శిఖరాగ్ర సమయంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూకే ప్రధాని రిషి సునాక్, ప్రధాని మోడీలను నమస్తే అంటూ పలకరింపుతో గతంలో వార్తల్లో నిలిచారు. వైరల్ వీడియో..

Next Story