ఇరాన్ ఎముకలు విరగ్గొడుతున్నాం.. ఆ దేశంలో ప్రభుత్వం మారాల్సిందే: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఇరాన్ నిరంకుశ పాలన నుండి ఆ దేశ ప్రజలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని, ప్రస్తుతం తాము చేపట్టిన దాడులు ఇరాన్ ‘ఎముకలు విరగ్గొడుతున్నాయని’ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ ఎముకలు విరగ్గొడుతున్నాం.. ఆ దేశంలో ప్రభుత్వం మారాల్సిందే: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌తో కొనసాగుతున్న పోరులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధ ప్రకటనే చేశారు. ఇరాన్ నిరంకుశ పాలన నుండి ఆ దేశ ప్రజలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని, ప్రస్తుతం తాము చేపట్టిన దాడులు ఇరాన్ ‘ఎముకలు విరగ్గొడుతున్నాయని’ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇజ్రాయెల్ ఆరోగ్య రంగ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు, యుద్ధం జరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ అంతర్గతంగా బలంగా ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ‘మా దేశంలోని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. పోరాడే దేశం అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ స్పందిస్తూ.. తాము కాల్పుల విరమణకు సిద్ధంగా లేమని, పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.

ట్రంప్ హెచ్చరికలు - మార్కెట్ల అనిశ్చితి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై పరస్పర విరుద్ధమైన సంకేతాలు ఇస్తున్నారు. ఒకవైపు ఇది 'స్వల్పకాలిక చర్య' అని పేర్కొంటూనే, మరోవైపు ఇరాన్ గనుక 'స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్' (Hormuz Strait) జలసంధిని మూసివేయాలని చూస్తే దాడులను తీవ్రతరం చేస్తామని సామాజిక మాధ్యమాల వేదికగా హెచ్చరించారు.

Next Story