- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొజ్తాబా ఓ కీలుబొమ్మ : నెతన్యాహు
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ రెవల్యూషనరీ గాడ్స్ కీలుబొమ్మ అంటూ ధ్వజమెత్తారు నెతన్యాహు.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని విమర్శలు చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రెవల్యూషనరీ గాడ్స్ కీలుబొమ్మ అంటూ ధ్వజమెత్తారు. బయటకు కూడా రాలేకపోతున్నాడని పరువు తీశారు బెంజమిన్ నెతాన్యహు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కు చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మరణించారని స్పష్టం చేశారు. ఇక ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ మార్గం వైపు అడుగులు వేసే సమయం వచ్చిందని వివరించారు. మేము వారికి అండగా ఉంటామని ప్రకటించారు. కానీ మార్పు మాత్రం వారి చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు బెంజమిన్ నెతాన్యహు.
ఇది ఇలా ఉండగా దివంగత ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ సతీమణి ఇంకా బతికే ఉన్నారని తాజాగా ఇరాన్ రాష్ట్ర మీడియా వెల్లడించింది. ఫిబ్రవరి 28వ తేదీన అలీ ఖమేనీ నివాసంపై 30 బాంబులు వేసింది ఇజ్రాయెల్. ఈ సంఘటనలో అలీ ఖమేనీ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఈ సంఘటనలో గాయపడిన ఆయన భార్య చనిపోయినట్లు ముందు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె బతికే ఉన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.






