Viral : నేపాల్‌లో జెన్ జీ‌ల ఆగ్రహం.. డిప్యూటీ పీఎం, మంత్రిని వీధుల్లో ఉరికించి కొట్టిన వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-09-09 13:37:58  IST  )

సోషల్ మీడియా బ్యాన్, అవినీతికి వ్య‌తిరేకంగా రోడ్ల‌పైకి వ‌చ్చి జెన్ జీ యువ‌త ఆందోళనలు చేపట్టారు.

Viral : నేపాల్‌లో జెన్ జీ‌ల ఆగ్రహం.. డిప్యూటీ పీఎం, మంత్రిని వీధుల్లో ఉరికించి కొట్టిన వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేపాల్‌లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియా బ్యాన్, అవినీతికి వ్య‌తిరేకంగా రోడ్ల‌పైకి వ‌చ్చి ‘జెన్ జీ’ యువ‌త ఆందోళనలు చేపట్టారు. దీంతో దేశంలో సోష‌ల్ మీడియాను పున‌రుద్ద‌రించిన‌ప్ప‌టికీ జెన్ జీల ఆగ్రహం ఆగ‌డంలేదు. జెన్ జీల ఆందోళనల (Gen Z protests)తో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) రాజీనామా చేసినా కూడా ఆందోళనలు మాత్రం ఆగట్లేదు. మంత్రులు, అధికార పార్టీ నేతలే టార్గెట్‌గా జెన్ జీలు దాడులు కొనసాగించేదుకు ప్రయాత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరసనకారులు నేపాల్‌ డిప్యూటీ పీఎం (Nepal Deputy PM), ఫైనాన్స్ మినిస్టర్ బిష్ణు ప్రసాద్ పాడేల్‌ను వీధుల్లో పరుగెత్తించి కొట్టినట్లు సమాచారం. అతని వాహనాన్ని అడ్డుకోని, వాహనం నుంచి బయటకు లాగారు. దీంతో పారిపోతున్న మంత్రిని వెంటపడి మరీ ఆందోళనకారులు చితకబాదారని ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో చూపిస్తున్న ప్రకారం.. బిల్డింగ్ పైకప్పు నుంచి తీసిన ఈ ఫుటేజ్‌లో.. ఒక వ్యక్తిని జన సమూహం తరుముతోంది. వీధిలో విచక్షణ రహితంగా కొట్టుకుంటూ వ్యక్తిని పరిగెత్తించారు. వ్యక్తి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించనప్పటికీ, జాతీయ మీడియా అతన్ని మంత్రి బిష్ణు ప్రసాద్ పాడేల్‌గా గుర్తించింది. కాగా, ఇవాళ (మంగళవారం) నిరసనకారులు నేపాల్ అధ్యక్షుడు రామ చంద్ర పౌడెల్(Ram Chandra Poudel), ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి ప్రైవేటు నివాసాలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే బోహరత్‌పూర్‌లోని పౌడెల్ ఇంట్లోకి నిరసనకారులు దూసుకెళ్లి ఇల్లు ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాల్కోట్‌లో ఓలి నివాసానికి నిప్పు పెట్టారని వార్తలు వస్తున్నాయి.

Next Story