- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టర్కీలో అద్భుతం... 2 నెలల తర్వాత..
by S Gopi |
టర్కీలో అద్భుతం జరిగింది. భూకంపంతో తల్లికి దూరమైన పసికందు తిరిగి తల్లిని చేరింది. ఈ విషయాన్ని... Nearly two months after Turkey quake, 'miracle' baby girl reunited with her mother

X
అంకారా: టర్కీలో అద్భుతం జరిగింది. భూకంపంతో తల్లికి దూరమైన పసికందు తిరిగి తల్లిని చేరింది. ఈ విషయాన్ని టర్కీ కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. డీఎన్ఏ టెస్టు ద్వారా తల్లిని గుర్తించి చేరవేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీలో భారీ భూకంపం భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మూడున్నరెళ్ల పసికందును రెస్క్యూ బృందాలు రక్షించాయి. పాపకు ఎటువంటి ప్రమాదం జరగలేదని గుర్తించాయి. తాజాగా అదానా ఆసుపత్రిలో ఉన్న తల్లి వద్దకు చేర్చినట్లు అధికారులు వెల్లడించారు. చిన్నారి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తల్లిని కూతురు తిరిగి కలపడం ప్రపంచంలోనే విలువైన టాస్కులలో ఒకటని చెప్పారు. కాగా, పాపను ఇన్ని రోజులు అధికారులు బాగోగులు చూసుకున్నారు.
Next Story






