- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవీ ముంబయి ఎయిర్ పోర్టు నుంచి ఎప్పటి నుంచి విమానాల రాకపోకలంటే?
నవీ ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు అదానీ గ్రూప్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (PUC)కి అధికారికంగా తెలియజేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: నవీ ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు అదానీ గ్రూప్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (PUC)కి అధికారికంగా తెలియజేసింది. విమానాశ్రయం నిర్మాణ బాధ్యతలు చేపట్టిన అదానీ గ్రూప్, విమానాశ్రయ ప్రాజెక్ట్ సమీక్ష కోసం కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లిన సందర్భంగా నిర్మాణ పురోగతిపై ప్రజేంటేషన్ ఇచ్చారు అధికారిక సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి. మొదటగా స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న విమానాల ప్రారంభానికి ప్రణాళికలు రూపొందించినా, టెర్మినల్ పనులు పూర్తికాకపోవడం వల్ల సెప్టెంబర్ 17వ తేదీ నాటికి పూర్తి చేయాలన్న దిశగా చర్యలు సాగుతున్నాయి.
యుద్ధ ప్రాతిపదికన పనులు
ప్రస్తుతం నవీ ముంబై విమానాశ్రయం నిర్మాణ పనుల్లో సుమారు 13,000 మంది కార్మికులు రాత్రి పగలు పని చేస్తున్నారు. ప్రారంభ దశలో దేశీయ విమానాలే కాకుండా, అంతర్జాతీయ విమానాల సేవలను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూప్ మధ్య తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పవచ్చు. విమానాశ్రయ ప్రారంభ దశలో 2 కోట్ల మంది ప్రయాణికులు, 8 లక్షల టన్నుల కార్గో నిర్వహణ సామర్థ్యంతో నిర్వ హించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఏడాది సుమారు 9 కోట్ల మంది ప్రయాణికులతో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సర్వీసులు అందించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. మొత్తం ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి ఇది వార్షికంగా 90 మిలియన్ ప్రయాణికులు (అంటే 9 కోట్లు) 3.02 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించగలదు. దీనిలో Code-E రన్‌వే, రెండు సమాంతర టాక్సీవేలు, టర్మినల్-1 భవనం, కార్గో టెర్మినల్ తో పాటు పలు మౌలిక సదుపాయాలు ఉండనున్నాయి.






