భ‌య్యా స‌న్నీయాద‌వ్ అరెస్ట్‌పై స్పందించిన ప్ర‌పంచ యాత్రికుడు!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-26 15:20:46  IST  )

బైక్ రైడ‌ర్, యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీయాద‌వ్‌ను ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌న్నీయాద‌వ్

భ‌య్యా స‌న్నీయాద‌వ్ అరెస్ట్‌పై స్పందించిన ప్ర‌పంచ యాత్రికుడు!
X

దిశ, వెబ్ డెస్క్: బైక్ రైడ‌ర్, యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీయాద‌వ్‌ను ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌న్నీయాద‌వ్ అరెస్ట్ పై మ‌రో యూట్యూబ‌ర్ ప్ర‌పంచ యాత్రికుడు అన్వేష్ స్పందించి కీల‌క వాఖ్య‌లు చేశాడు. భ‌య్యా స‌న్నీయాద‌వ్ పాకిస్థాన్ వెళ్లి వ‌చ్చిన త‌ర‌వాత ఏప్రిల్ 10వ తేదీన ప‌హెల్గామ్ ఎటాక్ జ‌రిగింద‌న్నారు. ఇదే కేసులో జ్యోతి మ‌ల్హోత్రాను కూడా అరెస్ట్ చేశార‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో పాకిస్థాన్ వెళ్లొచ్చిన అంద‌రినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నార‌ని, జ్యోతి మ‌ల్హోత్రా స్పైగా మారిన‌ట్టు విచార‌ణ‌లో నిర్దార‌ణ అయ్యింద‌ని చెప్పారు. పహెల్గామ్ ఎటాక్ త‌ర‌వాత వ్యూస్ ఎక్కువ వ‌స్తాయ‌ని పాకిస్థాన్ వీడియోలు అప్లోడ్ చేశాడ‌న్నారు.

పాకిస్థాన్ మ‌న శ‌తృదేశం అని భ‌య్యా స‌న్నీయాదవ్ ఆ దేశాన్ని చూపించ‌డం క‌ల అని చెప్పుకుంటున్నాడ‌ని మండిపడ్డారు. భ‌న్నీ స‌న్నీయాద‌వ్‌కు దేశం ఏం అయిపోయినా ప‌ర్వాలేద‌ని డ‌బ్బులు వ‌స్తే చాలని అన్నాడు. స‌న్నీయాద‌వ్‌కు ఆరు అంతస్తుల ఇల్లు ఉందని, జాగ్వార్ కారుతో పాటూ కాస్ట్లీ బైకులు ఉన్నాయని చెప్పాడు. ఆ డబ్బు ఎక్కడ నుండి వచ్చిందని ఎన్ఐఏ ప్రశ్నిస్తుందని అన్వేష్ తెలిపాడు. సన్నీయాదవ్ డబ్బంతా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారానే సంపాదించాడని చెప్పాడు.

సన్నీయాదవ్ రెండు నెలల పాటు పాకిస్థాన్‌లో ఉన్నాడని, నిషేధిత ప్రదేశాల్లో తిరిగాడని చెప్పాడు. అతడు స్పైగా పనిచేస్తున్నాడా లేదా అనేది విచారణలో తేలుతుందని అన్నాడు. డబ్బుల కోసమే పాకిస్థాన్ వీడియోలు అప్లోడ్ చేశాడని తెలిపాడు. 5 నెలల క్రితం పాకిస్థాన్ వెళ్లడానికి భారత యూట్యూబర్లకు అవకాశాలు వచ్చాయని ఇదివరకు అవకాశం లేదని చెప్పాడు. పాక్ ఆర్థికంగా చితికిపోయిన తరవాతనే భారత యూట్యూబర్లకు అనుమతి ఇచ్చిందని అన్నారు. తనకు అవకాశం ఉన్నా వెళ్లలేదని, శత్రుదేశం కాబట్టే వెళ్లలేదని చెప్పారు. అజర్ బైజాన్ వెళ్లినా కూడా ఆ దేశ వీడియోలు డిలీట్ చేశానని చెప్పారు. పాకిస్థాన్‌తో యుద్దం సమయంలో ఆ దేశానికి సపోర్ట్ చేసినందుకే టర్కీ, అజర్ బైజాన్ వీడియోలు డిలీట్ చేసినట్టు చెప్పారు. ఏదేమైనా భయ్యా సన్నీయాదవ్ సురక్షితంగా బయటకు రావాలన్నారు. వ్యూస్ వస్తున్నాయని పాకిస్థాన్ వీసాలు రాగానే యూట్యూబర్లు వెళ్లొద్దని హెచ్చరించారు.

Next Story