అక్కడ భర్తలను అద్దెకు ఇస్తారు..ఒక్క గంటకు ఎంతంటే ?

by velandi.Saikiran |

భార్యలను ( Wife ) అద్దెకిచ్చి... డబ్బులు సంపాదించే సంఘటనలు చాలా చూశాం. అయితే తాజాగా భర్తలను ( Husband ) కూడా అద్దెకిచ్చ

అక్కడ భర్తలను అద్దెకు ఇస్తారు..ఒక్క గంటకు ఎంతంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: భార్యలను ( Wife ) అద్దెకిచ్చి... డబ్బులు సంపాదించే సంఘటనలు చాలా చూశాం. అయితే తాజాగా భర్తలను ( Husband ) కూడా అద్దెకిచ్చే సంస్కృతి తెరపైకి వచ్చింది. కుటుంబం కష్టాల్లో ఉంటే.. డబ్బు కోసం భర్తలనే భార్యలు అద్దెకిస్తున్నారు. OLX లో పెట్టి పాత వస్తువులు అమ్మినట్లు... భర్తలను ఆన్లైన్ లో (On Line) పెట్టి... అద్దెకిస్తున్నారు మహిళలు ( Womens). ఇటీవల కాలంలోనే ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ... తన భర్తను అద్దెకిచ్చిందట ( Rent). ఇలా అద్దెకు ఇవ్వడం ద్వారా... ఒక గంటకు 40 US పౌండ్స్ సంపాదించింది సదరు మహిళ. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సంస్కృతి నైజీరియా దేశంలో కొనసాగుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నైజీరియా దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా... భర్తలను అద్దెకిచ్చే బిజినెస్ కొనసాగుతోందట. తమ భర్తలను అద్దెకిచ్చి... డబ్బులు సంపాదిస్తున్నారట భార్యలు. ఆ డబ్బులతో కుటుంబ పోషణ చూసుకుంటున్నారట.

అద్దెకు ఎలా ఇస్తారు.. రూల్స్ ఏంటి?

నైజీరియాలో భర్తను అద్దెకి ఇచ్చేటప్పుడు... ఆచితూచి వ్యవహరిస్తారు. అక్కడ దీనికి ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంటుందట. ఆ వెబ్సైట్లో తమ భర్తల ఫోటోలు అప్లోడ్ చేస్తారు. అందంగా ఉన్న వారికి ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్న వ్యక్తికి ధర భారీగా పలుకుతుందని సమాచారం. హైట్ అలాగే బరువు కూడా చూస్తారు. అన్ని బాగున్న పురుషుడికి ఎక్కువ ధర పెడతారట. గంటల తరహా అలాగే రోజుల తరహా అద్దెకు ఇస్తారని చెబుతున్నారు. నైజీరియాలో ఇది ఆచారంగా వస్తుందని సమాచారం.

Next Story