అమెరికాలో ఘోర ప్రమాదం.. బిజినెస్ జెట్ కూలి పలువురు మృతి

by Naga Rani Yarlagadda |

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. బిజినెస్ జెట్ కూలి పలువురు మృతి చెందారు.

అమెరికాలో ఘోర ప్రమాదం.. బిజినెస్ జెట్ కూలి పలువురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. బిజినెస్ జెట్ కూలి పలువురు మృతి చెందారు. దేశంలోని నార్త్ కరోలినాలో ఈ ప్రమాదం జరిగింది. స్టేట్స్ విల్లే రీజనల్ ఎయిర్ పోర్టులో సెసనా c550జెట్ ను ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలింది. వెంటనే జెట్ నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ప్రమాదం కారణంగా ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. జెట్ క్రాష్ అవ్వడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story