- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడల్ గొంతు కోసి.. కారును కాలువలో తోసి చంపిన బాయ్ ఫ్రెండ్
హర్యానా కు చెందని మోడల్ శీతల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా కు చెందని మోడల్ శీతల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. శీతల్, సునీల్ ఇద్దరు లవర్స్. శనివారం నుంచి ఆమె కనిపించడం లేదని హర్యానా పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆమె డెడ్ బాడీ ఆదివారం పానిపట్ లోని ఓ కాలువలో దొరికింది. ఆమె గొంతు కోసి చంపబడిందని పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జూన్ 14 రాత్రి 10.05 గంటలకు రికార్డయిన సీసీ టీవీ పుటేజీ లో శీతల్ తెల్లటి కారులో సునీల్ అనే వ్యక్తితో కలిసి ఎక్కుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. 24 ఏళ్ల శీతల్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఉండగా సునీల్ నీలి రంగు ట్రాలీ బ్యాగ్ పట్టుకుని కార్ ఎక్కుతున్నట్లు సీసీ పుటేజీలో రికార్డైంది.
శరీరంపై తీవ్ర గాయాలతో హత్యగా గుర్తింపు
ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని దీంతో శీతల్ ను హత్య చేసి కారును కాలువలోనికి తోసేశాడు. అనంతరం సునీల్ ఈదుకుంటూ బయటకు వచ్చాడు. తర్వాత ఆసుపత్రికి వెళ్లాడు ఈ హత్యను ప్రమాదం జరిగినట్లు చూపించేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంలో పోలీసులు హత్యగా భావించి ఆ దిశగా విచారణ చేపట్టారు. పానిపట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ సునీల్ అరెస్టును ధృవీకరించారు. సిమ్మీ అని పిలువబడే శీతల్, పానిపట్‌లోని అహార్ గ్రామానికి ఒక మ్యూజిక్ వీడియో షూట్ కోసం వెళ్ళింది, అక్కడ ఆమె సునీల్‌ను కలిసింది. సునీల్ కు గతంలో వివాహం జరగ్గా ఈ విషయాన్ని దాచి పెట్టాడని దీంతో వీరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఆమె మరణానికి ముందు, శీతల్ తన సోదరికి ఫోన్ చేసి, సునీల్ తనను కొడుతున్నాడని ఆరోపించింది. అయితే వీరిద్దరికి ఇంతకుముందే పెళ్లి అయిందని సునీల్ భార్యతో, శీతల్ భర్తతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.






