- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్యానాలో మోడల్ దారుణ హత్య
హర్యానా సోనిపట్ లోని మోడల్ డెడ్ బాడీ లభించింది. ఆమెను నిందితులు గొంతు కోసి కిరాతకంగా కిరాతకంగా హత్య చేసి కాలువలో పడేసినట్లు ఉందని పోలీసులు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా సోనిపట్ లోని మోడల్ డెడ్ బాడీ లభించింది. ఆమెను నిందితులు గొంతు కోసి కిరాతకంగా హత్య చేసి కాలువలో పడేసినట్లు ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలిని శీతల్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు. దారుణ హత్యకు కారణం ఇంకా తెలియరాలేదు, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. శీతల్ తన సోదరి నేహాతో పానిపట్‌లో నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 14న మోడల్ అహర్ గ్రామంలో షూటింగ్ కోసం వెళ్లింది. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో, బాధితురాలి సోదరి ఓల్డ్ ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణలో పోలీసులు ఆమె మృతదేహాన్ని ఖండా గ్రామ సమీపంలోని కాలువలో గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
గత వారం సోషల్ మీడియా ఇన్స్లుయెన్సర్ హత్య
గత వారం సోషల్ మీడియాను ప్రభావితం చేసే కమల్ కౌర్ మృతదేహం పంజాబ్‌లోని బతిండా-చండీగఢ్ జాతీయ రహదారిలోని ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ పార్కింగ్ స్థలంలో కారులో కనుగొనబడింది. లూథియానా రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఉన్న వాహనం వెనుక సీటుపై మృతదేహం కనిపించగా, మొదట్లో గుర్తుపట్టలేకపోయారు. కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదు తో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 9న కౌర్ ఇంటి నుంచి బయలుదేరి, ఒక ప్రచార కార్యక్రమానికి హాజరయ్యేందుకు బతిండా వెళ్తున్నట్లు తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆ తర్వాత ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందించలేదు. కౌర్ డెడ్ బాడీ దొరికిన కారును ఓ వ్యక్తి నడుపుతున్నట్లు సీసీ పుటేజీలో కనిపించింది. ఈ దిశగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






