- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లండన్‌లో దారుణం.. రైలులో మైనర్ బాలికపై అత్యాచారం.. బలవంతంగా టాయిలెట్‌లోకి లాక్కెళ్లి..
లండన్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలు టాయిలెట్‌లో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. వూల్‌విచ్ ఆర్సెనల్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌లోనే లైంగిక వేధింపులు ప్రారంభించిన వ్యక్తి.. బాధితురాలు అబ్బే వుడ్ వైపు వెళ్లే థేమ్స్ లింక్ ట్రైన్ ఎక్కగా..

దిశ, వెబ్ డెస్క్ : లండన్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలు టాయిలెట్‌లో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. వూల్‌విచ్ ఆర్సెనల్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌లోనే లైంగిక వేధింపులు ప్రారంభించిన వ్యక్తి.. బాధితురాలు అబ్బే వుడ్ వైపు వెళ్లే థేమ్స్ లింక్ ట్రైన్ ఎక్కగా.. అతను కూడా అదే రైలు ఎక్కాడు. అక్కడ కూడా సెక్సువల్ హరాజ్మెంట్ చేస్తూ.. బలవంతంగా రైలు టాయిలెట్‌లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత 30 ఏళ్ల నిందితుడు అబ్బే వుడ్ స్టేషన్ వద్ద రైలు నుండి దిగిపోగా.. బాధితురాలు స్లేడ్ గ్రీన్‌లో దిగింది.. అక్కడ పోలీసులకు కంప్లెయింట్ చేసింది.
బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసు (BTP) ఈ ఇన్సిడెంట్‌పై విచారణ ప్రారంభించింది. జులై 24న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నవారు తమను సంప్రదించాలని కోరారు పోలీసులు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే 61016 నంబర్‌కు మెసేజ్ చేయాలని, 0800 40 50 40 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.






