- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran: 10 రోజుల క్రితం విశాఖలో కవాతు..కానీ ఇంతలోనే మృతి
10 రోజుల క్రితం విశాఖలో కవాతు నిర్వహించిన ఇరాన్ కు చెందిన నావికాదళం సభ్యులు మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్-యూఎస్ఏ మధ్య యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దాదాపు 5 రోజుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్-యూఎస్ఏ మధ్య యుద్ధం భయంకరంగా సాగుతోంది. అయితే, ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ కు ఊహించని షాక్ తగిలింది. గల్ఫ్ ఆఫ్ ఉమెన్ ప్రాంతంలో ఇరాన్ కు సంబంధించిన యుద్దన ఒకపై అమెరికా నేతృత్వంలోని దళాలు దాడి చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఇరాన్ యుద్ధ నౌక తీవ్రంగా దెబ్బతిందని చెబుతున్నారు.
దీంతో ఆ నౌక నీళ్లలోనే మునిగిపోయిందని సమాచారం. ఇందులో చాలామంది ఇరాన్ కు సంబంధించిన సిబ్బంది మృతి చెందారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, 10 రోజుల క్రితం విశాఖలో కవాతు నిర్వహించిన ఇరాన్ కు చెందిన నావికాదళం సభ్యులు కూడా ఈ సంఘటనలో మరణించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవల విశాఖపట్నంలో మిలాన్ 2026 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నౌకాదళ విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలలో పది రోజుల కిందట ఇరాన్ నావికాదళం సభ్యులు పాల్గొన్నారు. వాళ్లే ఇప్పుడు అమెరికా దాడిలో మృతి చెందారు. దీంతో ఈ సంఘటనపై ఏపీకి చెందిన పౌరులు ఎమోషనల్ అవుతున్నారు. తమతో జాలీగా గడిపిన వాళ్ళు ఇప్పుడు మరణించడం దారుణం అంటున్నారు.






