- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రాంతాన్ని సందర్శించిన మెహబూబా ముఫ్తీ.. తీవ్ర ఆవేదన
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి రావడం పై జమ్ముూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందించారు. కాల్పుల కారణంగా అనేక మంది చనిపోయారని.. ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇలాంటి ఒప్పందం అవసరం అన్నారు. దీంతో సరిహద్దులో శాంతి నెలకొంది. కాల్పులు ఆగిపోయాయని తెలిపారు. కానీ.. ఈ మూడు రోజుల ఘర్షణ జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో చాలా నష్టాన్ని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఉరిలో కొన్ని ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవాళ(మే 11) జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆ జిల్లాను సందర్శించారు.
ఉరిని సందర్శించిన మెహబూబా..
మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఉరిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు చాలా సంపన్నంగా కనిపించిన ఉరి నేడు ఖాళీగా కనిపిస్తోంది అన్నారు. ఎక్కడ చూసిన జనాలతో సందడి వాతావరణం ఉన్న ఉరిలో ప్రస్తుతం ఏ వీధుల్లో ఎవరూ కనిపించడం లేదన్నారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనేక కుటంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో ఇల్లు లేక చాలా కుటుంబాలు ఆశ్రయాలలో నివసించవలసి వస్తుందని ఆవేదన చెందారు. ప్రస్తుతానికి, కాల్పుల విరమణ అమలు అవుతుందని, ప్రజలు ఇకపై ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోరని మేము ఆశిస్తున్నాం అని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






