- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UN COP30 క్లైమేట్ సమిట్ ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం
బ్రెజిల్‌లోని బెలేం నగరంలో జరుగుతున్న UN COP30 క్లైమేట్ సమిట్ ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: బ్రెజిల్‌లోని బెలేం నగరంలో జరుగుతున్న UN COP30 క్లైమేట్ సమిట్ ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ‘బ్లూ జోన్’ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో సమావేశాలు, చర్చలు, దేశాల పెవిలియన్, మీడియా సెంటర్, ప్రముఖ ప్రతినిధుల కార్యాలయాలు ఉన్న ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఖాళీ చేయించారు. ఈ ఘటనలో కనీసం 21 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే వేలాది మంది ప్రతినిధులు, అధికారులు బయటకు పరుగులు తీశారు. భద్రతా దళాలు వెంటనే స్పందించి వేదికను పూర్తిగా మూసివేసి సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ చేపట్టాయి. సుమారు ఆరు గంటల తర్వాత, రాత్రి 8:40 కు వేదికను తిరిగి తెరిచారు. అయితే, మంటలు చెలరేగిన కంట్రీ పెవిలియన్లు ప్రాంతాన్ని మాత్రం మూసివేశారు. ఘటనకు గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.






