- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
7.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
వారం రోజుల క్రితం మయన్మార్ లో భారీ భూకంపం వచ్చి భారీ సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: వారం రోజుల క్రితం మయన్మార్ లో భారీ భూకంపం (huge earthquake) వచ్చి భారీ సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ప్రమాదాన్ని మర్చిపోకముందే మరికొన్ని సార్లు భూకంపం వచ్చి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా పపువా న్యూగినియా (Papua New Guinea)లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు (Richter scale)పై దీని తీవ్రత 7.2గా నమోదు అయింది. గంట వ్యవధిలో మూడు సార్లు భారీ భూ ప్రకంపనలు (Three major earthquakes) వచ్చాయి. కాగా 7.2 తీవ్రతతో భూ ప్రకంపణలు రావడంతో.. స్థానిక వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ (Tsunami warnings issued) చేసింది. ఉదయం 6:04 గంటల సమయంలో న్యూ బ్రిటన్ ద్వీపంలోని కిమ్బే పట్టణానికి 194 కిలోమీటర్ల (120 మైళ్ల) తూర్పున ఒక శక్తివంతమైన భూకంపం సంభవించింది.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతను నమోదు చేసింది, అయితే కొన్ని నివేదికలు దీనిని 7.2 తీవ్రతగా కూడా పేర్కొన్నాయి. ఈ భూకంపం 10 కిలోమీటర్ల (6 మైళ్ల) లోతులో సంభవించినట్లు తెలుస్తోంది, ఇది సముద్ర తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ భూకంపం కేంద్రం పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" ప్రాంతం గుర్తించబడింది. ఇది ప్రపంచంలో అత్యధిక భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. భూకంపం సంభవించిన వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేశారు. దీంతో పపువా న్యూగినియా తీరంలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.






