ఇరాన్‌లో మారణహోమం.. వేలాది మంది మృతి?

by Ramesh Naini |

ఇరాన్‌లో చెలరేగిన ఆందోళనలు అత్యంత హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వస్తున్న వార్తలు అంతర్జాతీయ సమాజాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి.

ఇరాన్‌లో మారణహోమం.. వేలాది మంది మృతి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌లో చెలరేగిన ఆందోళనలు అత్యంత హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వస్తున్న వార్తలు అంతర్జాతీయ సమాజాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. మృతుల సంఖ్యపై అధికారిక లెక్కలకు, మీడియా కథనాలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆందోళనకరంగా మరణాల సంఖ్య ఆందోళనల అణచివేతలో దాదాపు రెండు వేల మంది మరణించి ఉండవచ్చని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

రెండు రోజుల్లో దాదాపు 12 వేల మంది..

అయితే, ప్రముఖ మీడియా సంస్థ ‘ఇరాన్‌ ఇంటర్నేషనల్‌’ ప్రచురించిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 12 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ కథనంలో పేర్కొనడం గమనార్హం. ఐక్య రాజ్యసమితి తీవ్ర స్పందన ఇరాన్‌లో జరుగుతున్న హింసాకాండపై ఐక్యరాజ్యసమితి (UN) మానవ హక్కుల విభాగం చీఫ్ వోల్కర్ టర్క్ (Volker Turk) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరసనకారులపై విచక్షణారహితంగా బలప్రయోగం జరుగుతోందని, వందలాది మంది చనిపోయారన్న వార్తలు తనను కలచివేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Next Story