శశిథరూర్ వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే సీరియస్

by Shamantha N |

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

శశిథరూర్ వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే సీరియస్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. శశిథరూర్ ‘ప్రధాని మోడీ శక్తి, చైతన్యం ప్రపంచ వేదికపై పాల్గొనడంలో సంసిద్ధత భారత్‌కు ప్రధాన ఆస్తిగా మారాయి’ అంటూ ది హిందూ పత్రికలో రాసిన వ్యాసం తీవ్ర వివాదానికి దారి తీసింది. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తిని రేపాయి. కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మాకు దేశం ముందు.. కొందరికి మోడీ ముందు

శశి థరూర్ అభిప్రాయాన్ని ఖండించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా ‘ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం’ పార్టీ అధికారికంగా ప్రకటించింది కాదని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఘాటుగా స్పందించారు. ‘మాకు దేశం ముందు, కొంతమందికి మోడీ ముందు’ అని థరూర్ వ్యాఖ్యలను పరోక్షంగా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. శశి థరూర్ ఇంగ్లీషులో నిష్ణాతుడు కాబట్టి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి తీసుకున్నాం’ అనే వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారాయి.

బీజేపీలో చేరడానికి సంకేతం కాదు: శశి థరూర్

మాస్కోలో జరిగిన సమావేశంలో థరూర్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. ‘ఇది బీజేపీలో చేరడానికి సంకేతం కాదు దేశం కోసం ఐక్యతకు పిలుపు’ అని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత ప్రభుత్వం చేసిన ప్రతిదాడిని ఆయన పొగడటం కాంగ్రెస్ లో కొంతమందికి నచ్చకపోయినా, దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో రాజకీయ భేదాలను పక్కనపెట్టిన ఆయన వైఖరిని మరికొంతమంది అభినందించారు. అయితే తర్వాత కాల్పుల విరమణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అమెరికా పాత్రపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తడం ఈ అంతర్గత భిన్నాభిప్రాయాలను మరింత హైలైట్ చేసింది.

Next Story