- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దక్షిణాఫ్రికాలో మహీంద్రా కార్ల అమ్మకాల జోరు.. రోజు రోజుకు పెరుగుతున్న బ్రాండ్
భారత కార్ల తయారీ సంస్థ అయిన మహీంద్రా దక్షిణాఫ్రికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత కార్ల తయారీ సంస్థ అయిన మహీంద్రా (Mahindra) దక్షిణాఫ్రికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆటోమోటివ్ బ్రాండ్ (Automotive brand)గా అవతరించిన మహింద్ర బ్రాండ్ (Mahindra brand) ఆ దేశంలో రోజు రోజుకు పెరుగుతూ.. తమ వాహనాల విక్రయాల్లో రికార్డు సృష్టించింది. 2025 మార్చిలో మహీంద్రా దక్షిణాఫ్రికాలో 2,253 వాహనాలను విక్రయించి, గత రికార్డు (ఫిబ్రవరి 2025లో 1,613 వాహనాలు) కంటే సుమారు 40% అధిక విక్రయాలు సాధించింది. ఈ ఘనతతో మహీంద్రా దక్షిణాఫ్రికా (South Africa)లో ఎనిమిదో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా అవతరించింది.
అలాగే గత ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా మొత్తం 15,088 వాహనాలను విక్రయించి కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. మార్చిలో SUVలు (1,000 యూనిట్లు) బక్కీలు (1,256 యూనిట్లు) రికార్డు స్థాయిలో విక్రయించ బడ్డాయి. నాంసా (దక్షిణాఫ్రికా ఆటోమోటివ్ ఇండస్ట్రీ బిజినెస్ కౌన్సిల్) డేటా ప్రకారం.. 500 యూనిట్ల కంటే ఎక్కువ నెలవారీ విక్రయాలు ఉన్న హై-వాల్యూమ్ బ్రాండ్‌లలో మహీంద్రా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా నిలిచింది. మహీంద్రా బ్రాండ్ లో అత్యధికంగా.. మహీంద్రా XUV 3XO, XUV700, స్కార్పియో-N, బొలెరో పిక్-అప్, స్కార్పియో పిక్-అప్, కరూ పిక్-అప్ వంటి మోడళ్లు దక్షిణాఫ్రికా మార్కెట్‌లో బాగా ఆదరణ పొందాయి.






