- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్‌పీజీ ఎఫెక్ట్.. చాట్‌జీపీటీని వెనక్కి నెట్టిన 'ఇండియన్ ఆయిల్ వన్' యాప్
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టెక్నాలజీ దిగ్గజం ఓపెన్ఏఐకి చెందిన చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' ని ఓ భారతీయ యాప్ వెనక్కి నెట్టింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టెక్నాలజీ దిగ్గజం ఓపెన్ఏఐకి చెందిన చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' (ChatGPT)ని ఓ భారతీయ యాప్ వెనక్కి నెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) కు చెందిన ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్ యాప్ 'ఇండియన్ ఆయిల్ వన్' (Indian Oil ONE) సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అత్యధికంగా డౌన్‌లోడ్ అవుతున్న యాప్‌ల జాబితాలో (Top Downloaded) ఇది అగ్రస్థానంలో నిలిచింది.
నెల రోజుల్లో 40 లక్షల డౌన్‌లోడ్లు..
యాప్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం 'సెన్సార్ టవర్' వెల్లడించిన నివేదిక ప్రకారం.. గడిచిన 30 రోజుల్లోనే ఏకంగా 40 లక్షల మంది వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే చాట్‌జీపీటీ రికార్డులను సైతం ఇది అధిగమించింది. సిలిండర్ల బుకింగ్, డెలివరీ ట్రాకింగ్, కొత్త కనెక్షన్ల నమోదు వంటి సేవల కోసం ప్రజలు ఈ యాప్‌ను ఆశ్రయిస్తున్నారు.
కారణం పశ్చిమాసియా సంక్షోభమే..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, సంక్షోభమే ఈ యాప్ రికార్డు స్థాయి డౌన్‌లోడ్లకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరత ఏర్పడినట్లు దేశంలో ఆందోళన చెలరేగింది. ఏ క్షణంలో గ్యాస్ సరఫరా నిలిచిపోతుందోనన్న భయంతో వినియోగదారులు యాప్ ద్వారా ముందస్తు బుకింగ్‌లకు ఎగబడుతున్నారు. కాగా, దేశంలో గృహ వినియోగ సిలిండర్ల సరఫరాకు ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, కమర్షియల్ (వాణిజ్య) సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గ్యాస్ లేక ఇప్పటికే పలు హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. తెరిచి ఉన్న పలు రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూలను కుదించుకున్నాయి. మరోవైపు ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం సామాన్య ప్రజలు బారులు తీరుతున్నారు.






