Los Angeles: లాస్ ఎంజెల్స్ లో పరిమిత కర్ఫ్యూ

by Shamantha N |

అమెరికాలోని లాస్ ఎంజెల్స్ (Los Angeles) నగరంలోని డౌన్ టౌన్ లో జరుగుతున్న హింసాత్మక ఘర్షణలు అడ్డుకునేందుకు నగర మేయర్ కేరెన్ బాస్ మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు.

Los Angeles: లాస్ ఎంజెల్స్ లో పరిమిత కర్ఫ్యూ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని లాస్ ఎంజెల్స్ (Los Angeles) నగరంలోని డౌన్ టౌన్ లో జరుగుతున్న హింసాత్మక ఘర్షణలు అడ్డుకునేందుకు నగర మేయర్ కేరెన్ బాస్ మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కర్వ్యూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. లాస్ ఎంజెల్స్ లో గత అయిదు రోజుల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస వాద వ్యతిరేక విధానాలపై అక్కడి ప్రజలు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. కాగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. స్టోర్లలో లూటీలు, దోపీడీలు, కార్లకు నిప్పు పెట్టడం లాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కర్ప్యూ విధిస్తున్నట్లు మేయర్ తెలిపారు.

వలసదారులపై ఉక్కుపాదం

ట్రంప్ పాలనలో వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. గత వారం లాస్ ఏంజెలెస్‌లోని హోమ్ డిపో పార్కింగ్ వద్ద దుస్తుల కర్మాగారంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు 40 మందికి పైగా వలసదారులను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. దీనికి ప్రతిస్పందనగా ప్రజలు పెద్దఎత్తున రోడ్డెక్కారు. ఈ నిరసనలను ‘జాతీయ సార్వభౌమత్వంపై దాడి’గా అభివర్ణించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నిరసనకారులను అదుపు చేసేందుకు ఇన్సరెక్షన్ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. లాస్ ఏంజెలెస్‌ను విముక్తం చేయాల్సిన సమయం ఇదని విదేశీ జెండాలు పట్టుకున్న అరాచకవాదులు ప్రజా శాంతిని ధ్వంసం చేస్తున్నారని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ట్రంప్ చర్యలపై కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ మాట్లాడుతూ.. రాష్ట్రాల అధికారాల్లో ట్రంప్ జోక్యం సరికాదన్నారు. రాష్ట్రాల అనుమతి లేకుండా నేషనల్ గార్డ్స్ ను మోహరించడంతో కోర్టులో ట్రంపునకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు.

Next Story