వీడియో: లైవ్ డిబేట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్న నేతలు.. ఇది అరాచకం

by Dishafeatures2 |
వీడియో: లైవ్ డిబేట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్న నేతలు..  ఇది అరాచకం
X

దిశ, వెబ్‌డెస్క్: లైవ్ డిబేట్‌లో రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పరిధులు దాటి వ్యక్తిగతంగా దూషించుకుంటారు. కొన్నిసార్లు క్షణికావేశానికి గురై లైవ్ డిటేట్‌లో నేతలు కొట్టుకున్న ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది.

జావేది చౌదరి అనే యాంకర్ ఓ ప్రైవేట్ ఛానెల్‌లో కల్ తక్ అనే పేరులో టాక్ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఈ లైవ్ షోకు ఇమ్రాన్ ఖాన్‌ పీటీఐ పార్టీకి చెందిన షేర్ అప్ఝల్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ పార్టీకి చెందిన అఫ్నాన్ ఉల్లా పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో ఇమ్రాన్‌ఖాన్‌పై నవాజ్ షరీఫ్ మద్దతుదారుడైన ఉల్లా ఖాన్ తీవ్ర విమర్శలు కురిపించాడు. దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన షేర్ మార్వత్‌కు ఒక్కసారిగా కోపమొచ్చింది. దీంతో సహనం కోల్పోయిన ఆయన.. కుర్చీలోనుంచి లేచి అఫ్నాతుల్లా ఖాన్‌ చెంపపై కొట్టాడు. దీంతో ఖాన్ కూడా ఎదురుదాడికి దిగగా.. ఇద్దరూ కొట్టుకున్నారు. కింద పడి మరీ ఇద్దరూ పొట్టుపొట్టు కొట్టుకున్నారు. లైవ్ డిబేట్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రేక్షకులకు కాసేపు ఏం అర్థం కాలేదు. నేతలిద్దరూ కొట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story