- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బరువు తగ్గాలనుకుంటున్న కిమ్.. కానీ ప్రజలపై ఆ పరీక్షలు!
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్:ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి మిలిటరీ, మిసైళ్లు కాదు.. ఆయన ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఊబకాయం, నిద్రలేమి, మధుమేహం, హై బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్న ఆయన, బరువు తగ్గేందుకు విదేశాల్లో లభించే ఔషధాల కోసం తన సన్నిహితులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే, ఈ మందులు తానే మొదటగా వాడటానికి సిద్ధంగా లేరట. తనలాంటి శరీరాకృతి, వైద్య చరిత్ర కలిగిన పౌరులపై ముందుగా ప్రయోగించి ఫలితాలను గమనించి తార్చుకోబోతున్నారట!
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, కిమ్ గతంలో మద్యం, ధూమపానం బాగా అలవాటుపడిన నేపథ్యంలో నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారని, దాంతో పాటు ఆయన బరువు 140 కిలోల వరకూ చేరిపోయినట్టు తెలుస్తోంది. దీంతో శరీరానికి సంబంధించి అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఆయన తండ్రి కూడా నొప్పి నివారించే మందులను ఇతరులపై ప్రయోగించినట్లు చెబుతుండటం.. ఇప్పుడు కిమ్ తీసుకుంటున్న ఈ నిర్ణయానికి ఓ నేపథ్యంగా కనిపిస్తోంది.
2021లో ఒక్కసారిగా ఆయన బరువు తగ్గినట్టు వచ్చిన ఫొటోలు ఓసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించినా, ఆ మార్పు ఎక్కువకాలం నిలబడలేదు. ఇప్పుడు మాత్రం కిమ్ ఈ సమస్యను నిజంగా ఎదుర్కొనాలనుకుంటున్నట్టే కనిపిస్తున్నారు. అందుకే ఎంత ఖర్చయినా వెనకాడకుండా, ఎంత దూరమైనా వెతకడానికి సిద్ధమయ్యారు. కానీ తన ఆరోగ్య ప్రయోగానికి ముందుగా ఇతరులను ఉపయోగించాలనుకోవడమే ఇప్పుడు అంతర్జాతీయంగా మరోసారి ఆయనపై దృష్టి నిలిపేలా చేస్తోంది.






