- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిలోవా అగ్నిపర్వతం ఉగ్రరూపం.. 10 గంటలపాటు విస్ఫోటనం
by Naga Rani Yarlagadda |
కిలోవా అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. సుమారు 10 గంటలపాటు దాని నుంచి 1300 అడుగుల ఎత్తు వరకూ లావా ఎగసిపడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవా అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. ఆదివారం తెల్లవారుజామున మొదలైన విస్ఫోటనం దాదాపు 10 గంటలపాటు కొనసాగగా.. 1300 అడుగుల ఎత్తుకు లావా ఎగసి పడినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. 2,80,000 ఏళ్ల చరిత్రను కలిగి ఉన్న ఈ అగ్నిపర్వతం.. 1952 నుంచి మొన్నటి వరకూ డజన్ల సార్లు బద్దలైంది. అగ్నిపర్వతం విస్ఫోటనం ధాటికి వెలువడిన పొగ, గ్యాస్, బూడిదతో కూడిన మేఘాలు.. సముద్ర మట్టానికి సుమారు 35 వేల అడుగుల ఎత్తుకు వ్యాపించినట్లు జాతీయ వాతావరణ సంస్థ పేర్కొంది. పహాలా, నాలెహు వంటి గ్రామాలపై బూడిదవర్షం కురిసింది.
Next Story






