గుండె ఆగిపోయే క్లిప్... 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోతున్న బాలికను కాపాడాడు (వీడియో)

by S Gopi |

దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోతున్న మూడేళ్ల బాలికను...Kazakhstan Man Risks His Life To Save Toddler Hanging From Eighth Floor Window

గుండె ఆగిపోయే క్లిప్... 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోతున్న బాలికను కాపాడాడు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోతున్న మూడేళ్ల బాలికను రక్షించాడు. ఈ సంఘటన కజకిస్థాన్ రాజధాని నూర్-సుల్తాన్‌లో చోటు చేసుకుంది. తల్లి షాపింగ్‌కు వెళ్లిన సమయంలో, మూడేళ్ల బాలిక కిటికీలోంచి వేలాడుతూ కనిపించింది. అటుగా వెళ్తున్న వ్యక్తి ఆ బాలికను గమనించి కాపాడాడు. అయితే ఈ విషయం తెలిసి అక్కడి మంత్రిత్వ శాఖ సంఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ ను, వాహనాలను పంపింది. అయితే, అతను అప్పటికే ఆ బాలికను కాపాడగలిగాడు. దీంతో అక్కడి మంత్రిత్వ శాఖ అతడిని హీరో అని పేర్కొన్నది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజిన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story