14 ఏళ్ల బాలిక గొంతుకోసి చంపిన 17 ఏళ్ల బాలుడు

by Shamantha N |

జార్ఖండ్ లోని లోహర్దాగా జిల్లాలో 17 ఏళ్ల బాలుడు తన గర్ల్ ఫ్రెండ్ 14 ఏళ్ల బాలికను గొంతు కోసి హత్య చేశాడు.

14 ఏళ్ల బాలిక గొంతుకోసి చంపిన 17 ఏళ్ల బాలుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ లోని లోహర్దాగా జిల్లాలో 17 ఏళ్ల బాలుడు తన గర్ల్ ఫ్రెండ్ 14 ఏళ్ల బాలికను గొంతు కోసి హత్య చేశాడు. అనంతతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన సెరేంగ్‌డాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగింది. ఇద్దరూ దండూ గ్రామంలో జరిగిన రథయాత్ర జాతరకు స్నేహితులతో కలిసి హాజరయ్యారు. తిరిగి వస్తుండగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో జయనాథ్ అనే యువకుడు బాలికను కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.

వీడియో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేసి

హత్యను జయనాథ్ వీడియోలో చిత్రీకరించి బాలిక మృతదేహంతో పాటు రక్తంతో తడిసిన కత్తితో సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అనంతరం అటవీ ప్రాంతంలోకి పారిపోయి అక్కడే చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గ్రామస్థులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా, అప్పటికే అతడు తప్పించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత బాలిక తండ్రి రామదయాల్ ఖెర్వార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ఓ గ్రామంలోని స్కూల్ లో చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు.

Next Story