- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా పురుషాంగం, తల భద్రపరచండి.. వెలుగులోకి జెఫ్రీ ఎప్‌స్టీన్ వింత కోరిక!
అమెరికాలో సంచలనం సృష్టించిన 'జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్' వ్యవహారంలో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. ఇ

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో సంచలనం సృష్టించిన 'జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్' వ్యవహారంలో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. ఇప్పటికే ఈ జాబితాలో మాజీ అధ్యక్షులు, బడా వ్యాపారవేత్తలు, హాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు రావడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. కాగా, తాజాగా ఈ సెక్స్ ట్రాఫికర్ వ్యక్తిగత వింత పోకడలు, అతడికి సైన్స్‌పై ఉన్న విపరీత నమ్మకాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి.
క్రయోనిక్స్‌పై పిచ్చి నమ్మకం..
ఎప్‌స్టీన్‌కు 'క్రయోనిక్స్' (Cryonics) అనే ప్రక్రియపై విపరీతమైన ఆసక్తి ఉండేదని సమాచారం. ఈ విధానంలో మనిషి చనిపోయిన వెంటనే మృతదేహాన్ని అత్యంత శీతల ఉష్ణోగ్రతల వద్ద (-195° నుంచి -320° మధ్య) ఫ్రీజ్ చేస్తారు. భవిష్యత్తులో వైద్య విజ్ఞానం (Medical Science) అభివృద్ధి చెందాక, ఆ వ్యక్తికి ఉన్న జబ్బును నయం చేసి మళ్లీ బతికించవచ్చన్నది ఈ సిద్ధాంతం ప్రధాన ఉద్దేశం. అయితే దీనికి ఇప్పటివరకూ శాస్త్రీయంగా ఎలాంటి నిరూపణ లేదు. కానీ, ఎప్‌స్టీన్ దీనిని గుడ్డిగా నమ్మాడని తెలుస్తోంది.
తల, పురుషాంగం దాచాలని..
ఈ క్రయోనిక్స్ నమ్మకంతోనే ఎప్‌స్టీన్ తన సహచరుల వద్ద ఒక వింత కోరికను బయటపెట్టినట్లు తెలుస్తోంది. తన మరణానంతరం తన 'తలను', 'పురుషాంగాన్ని' (Penis) ఫ్రీజ్ చేసి భద్రపరచాలని అతడు కోరాడట. దీని వెనుక 'యూజెనిక్స్' (Eugenics - జాతిని మెరుగుపరచడం లేదా వంశాభివృద్ధి), 'ట్రాన్స్‌హ్యూమనిజం' (Transhumanism) వంటి సిద్ధాంతాలపై అతడికున్న పిచ్చి ప్రేమే కారణమని నివేదికలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులో తన రేంజ్ మనుషులను సృష్టించేందుకు లేదా తన జాతిని విస్తరించేందుకు అతడు ఇలా ప్లాన్ చేసినట్లు సమాచారం.






