- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుండపోత వర్షాల కారణంగా సౌదీలోని జెడ్డా అతలాకుతలం, ఫిల్మ్ ఫెస్టివల్ రద్దు
సౌదీ అరేబియాలో అసాధారణ వాతావరణం కారణంగా కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: సౌదీ అరేబియాలో అసాధారణ వాతావరణం కారణంగా కుండపోత వర్షాలు (Torrential rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ తీరంలో ఉన్న ప్రముఖ నగరమైన జెడ్డా (Jeddah) ఈ ఆకస్మిక వర్షాలకు అతలాకుతలమైంది. దీంతో నగరం వీధులు నీటిలో మునిగిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. మక్కా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Red Sea International Film Festival) కార్యక్రమాలు, ఈవెంట్‌లను అధికారులు రద్దు చేయాల్సి వచ్చింది.
నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) హెచ్చరికల మేరకు, భారీ వర్షం, పిడుగులు, వడగళ్ల వర్షం, గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల ముప్పు ఉంది. ఈ హెచ్చరికల దృష్ట్యా మదీనా, నార్తర్న్ బోర్డర్స్ సహా 8 ప్రాంతాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. నష్టాన్ని నివారించేందుకు జెడ్డా, రబిగ్, ఖులైస్ ప్రాంతాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి, ఆన్‌లైన్ తరగతులకు మారాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పౌర రక్షణ విభాగం ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, వరద కాలువలకు దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరించింది.






