మరో బోయింగ్ విమానంలో ట్రబుల్ .. జర్రయితే చచ్చిపోయేవారే

by Shamantha N |

జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JL8696 బోయింగ్ విమానం జూన్ 30న చైనా షాంఘై నుంచి జపాన్ టోక్యోకి వెళ్తుండగా ఒక్కసారిగా సుమారు 26,000 అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందకు దిగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

మరో బోయింగ్ విమానంలో ట్రబుల్ .. జర్రయితే చచ్చిపోయేవారే
X

దిశ, నేషనల్ బ్యూరో: జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JL8696 బోయింగ్ విమానం జూన్ 30న చైనా షాంఘై నుంచి జపాన్ టోక్యోకి వెళ్తుండగా ఒక్కసారిగా సుమారు 26,000 అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందకు దిగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బోయింగ్ 737 విమానంలో 191 మంది ఉండగా, ఆకస్మాత్తుగా కేబిన్ ప్రెజర్ పడిపోవడంతో ఆక్సిజన్ మాస్కులు విడుదలయ్యాయి. కొందరు నిద్రలేచి హడలిపోగా, మరికొందరు తమ కుటుంబాలకు బ్యాంక్ పిన్‌లు, ఇన్సూరెన్స్ వివరాలతో చివరి సందేశాలు పంపారు. పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రకటన చేసి విమానాన్ని ఒసాకాలోని కాంసాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించగా, ఫ్లైట్ సాయంత్రం 8:50కి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోయినా, వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

బోయింగ్ విమానాలపై పరిశీలన

ఈ సంఘటన బోయింగ్ విమానాల భద్రతపై ఇప్పటికే ఉన్న ఆందోళనలను మరింత పెంచింది. ఇటీవల అహ్మదాబాద్-లండన్ మార్గంలో బోయింగ్ విమానం దుర్ఘటనలో 275 మంది మృతి చెంచారు. తక్కువ కాలంలో ఇలా వరుస ఘటనలు జరగడం వల్ల బోయింగ్ తయారీ విమానాలపై విమర్శలు వస్తున్నాయి. కాగా బోయింగ్ విమానాల పరిశీలన మరింత తీవ్రతరం చేయనున్నారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించి సంస్థ తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.



Next Story