వందే భారత్ లో పర్యటించిన జమ్మూ కశ్మీర్ సీఎం

by Shamantha N |

జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆయన తండ్రి డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా గురువారం శ్రీనగర్ నుంచి కాట్రాకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించారు.

వందే భారత్ లో పర్యటించిన జమ్మూ కశ్మీర్ సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆయన తండ్రి డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా గురువారం శ్రీనగర్ నుంచి కాట్రాకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఇటీవల వందే భారత్ రైలును ప్రధాని మోదీ ఈ మధ్యనే ఇక్కడ ఆవిష్కరించారు. కాగా జమ్మూ కశ్మీర్ సీఎం వందే భారత్ రైలులో ప్రయాణించి సెల్పీ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చైర్ కార్ సీటులో కూర్చున్న సీఎం ఒమర్ అబ్దుల్లా రైలు కిటీకి నుంచి ఓ వీడియోను షూట్ చేసి దాన్ని తన ఎక్స్ అకౌంట్ లో పోస్టు చేశారు.

దేశంలో రైల్వే నెట్ వర్క్ లకు కలపడం సంతోషం

అధికార పార్టీకి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతలు సీఎం ఒమర్ అబ్దుల్లాకు కాట్రా రైల్వే స్టేషన్ లో స్వాగతం పలికారు. ఎస్సీ అడ్వైజ‌ర్ నాసిర్ అస్లం వానీ కూడా ఆ ట్రిప్‌లో ఉన్నారు. జూన్ 10వ తేదీన ఫారూక్ అబ్దుల్లా తొలిసారి వందేభార‌త్ రైలులో ప్ర‌యాణంచారు. దేశంలోని అన్ని రైల్వే నెట్ వర్క్ లతో కశ్మీర్ ను కలపడం సంతోషంగా ఉందని గతంలో ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. పహల్గాం దాడి ఘటన తర్వాత కశ్మీర్ లో ప్రధాని మోడీ పర్యటించి వందే భారత్ రైలును ప్రారంభించగా.. ప్రస్తుతం సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆయన తండ్రి ఫారూక్ అబ్దుల్లా వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించడం సంచలనంగా మారింది. ఇటు బీజేపీ, అటు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కశ్మీర్ లో ప్రత్యర్థులుగా ఉండటం, కేంద్రం ప్రారంభించిన రైలులో వీరు ప్రయాణించడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.

Next Story