- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆల్బేనియా దేశాధినేత స్వాగతానికి ఇటలీ ప్రధాని ఫిదా.. వీడియో వైరల్
అల్బేనియాలో ఇటీవల ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు 2025 జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: అల్బేనియాలో (Albanian) ఇటీవల ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు 2025 జరిగిన సంగతి తెలిసిందే. రాజధాని టిరానాలో నిర్వహించిన ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సదస్సుకు విచ్చేసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Italy PM Giorgia Meloni)కి అల్బేనియా దేశాధినేత ఎడీ రమా (AD Ramaa) మోకాలిపై కూర్చుని ఆహ్వానించారు. వర్షం పడుతున్న కూడా పట్టించుకోకుండా.. మెలోనీ కారు దిగి వస్తుంటే ఎడీ మోకాలిపై కూర్చుని చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ ఆహ్వానానికి మెలోనీ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా మెలోనీ తన ఇటాలియన్ సిస్టర్ అని ఎడీ రమా చెబుతుంటారు. ఆమె ఎప్పుడు ఎక్కడ కన్పించినా ఇలాగే పలకరిస్తారు. ఈ ఏడాది జనవరిలో మెలోనీ పుట్టినరోజు నాడు ఓ సదస్సులో కలిసిన ఎడీ.. ఆమెకు మోకాలిపై కూర్చుని స్కార్ఫ్‌ను కానుకగా ఇచ్చి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు కూడా వీరి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది.






