వేగంగా వెళ్తున్న రైలుపై విమానం ల్యాండింగ్.. ఇటలీ పైలట్ అరుదైన ప్రపంచ రికార్డు

by Ramesh Naini |   (  Updated:2026-02-17 13:37:19  IST  )

పైలట్ డారియో కోస్టా గాలిలో దూసుకెళ్తున్న విమానాన్ని, పట్టాలపై వేగంగా వెళ్తున్న రైలుపై ల్యాండ్ చేసి రికార్డు కొట్టాడు.

వేగంగా వెళ్తున్న రైలుపై విమానం ల్యాండింగ్.. ఇటలీ పైలట్ అరుదైన ప్రపంచ రికార్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విమానయాన చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన సాహస విన్యాసం తాజాగా టర్కీ వేదికగా జరిగింది. ఇటలీకి చెందిన ప్రముఖ పైలట్, రెడ్ బుల్ అథ్లెట్ డారియో కోస్టా గాలిలో దూసుకెళ్తున్న విమానాన్ని, పట్టాలపై వేగంగా వెళ్తున్న రైలుపై కొన్ని సెకన్ల పాటు ల్యాండ్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. రెడ్ బుల్ (Red Bull) ఆధ్వర్యంలో టర్కీలోని అఫ్యోంకరాహిసార్‌లో ఈ సాహసమైన ఈవెంట్ జరిగింది. డారియో కోస్టా తన 'జివ్కో ఎడ్జ్ 540' (Zivko Edge 540) విమానంతో దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కార్గో రైలును వెంబడించారు. ఈ నేపథ్యంలోనే రైలు చివరి కంటైనర్‌పై విమానాన్ని అత్యంత చాకచక్యంగా ల్యాండ్ చేసి (Touch-and-go), వెంటనే మళ్లీ గాల్లోకి ఎగిరారు. ఈ మొత్తం ఉత్కంఠభరిత ప్రక్రియ కేవలం 50 సెకన్లలోనే పూర్తయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

చరిత్రలో తొలిసారి!

కదులుతున్న రైలుపై విమానాన్ని ల్యాండ్ చేయడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. ఈ విన్యాసం కోసం కోస్టా చాలా కాలంగా కఠినమైన శిక్షణ పొందారని, ఏమాత్రం మిస్ అయినా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, చిన్నా పొరపాటు లేకుండా ఆయన ఈ ఘనత సాధించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు డారియో కోస్టా ధైర్యాన్ని, నైపుణ్యాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రెడ్ బుల్ సంస్థ అందరికీ గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాహసోపేతమైన, అద్భుతమైన అడ్వెంచర్ క్రీడలకు మద్దతు ఇచ్చే ఒక బ్రాండ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సాహస రేస్ వంటి ఈవెంట్‌లను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులు తమ పరిమితులను మంచి వెళ్ళేలా ప్రొత్సహిస్తోంది.

Next Story