- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవును ఖమేనీని చంపాలనుకున్నాం: ఇజ్రాయిల్
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సమయంలో ఇరాన్ అధినేత ఖమేనీని చంపాలని నిర్ణయం తీసకున్నట్లు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఖట్జ్ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సమయంలో ఇరాన్ అధినేత ఖమేనీని చంపాలని నిర్ణయం తీసకున్నట్లు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఖట్జ్ ప్రకటించారు. అయితే ఆ విషయంలో విఫలం అయినట్లు పేర్కొన్నారు. స్థానిక మీడియా చానల్స్ తో మాట్లాడిన ఖట్జ్.. ఖమేనీ బంకర్లలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోవడతో తమ ప్లాన్ విరమించుకున్నట్లు తెలిపారు. ఇరాన్ దేశ అగ్రనేతను అంతం చేయాలని అనుకున్నామని ఇజ్రాయిల్ అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు సంచలనం గా మారింది. ఖమేనీ కూడా హెజ్ బొల్లా నస్రుల్లా మాదిరిగానే సుదీర్ఘకాలం బంకర్లలోనే ఉండాలని సూచించారు.
తమ జోలికి వస్తే అమెరికాను వదిలిపెట్టం: ఖమేనీ
ఖమేనీని చంపడం తమ అజెండా కాదని యుద్ధ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన ఎక్కడున్నారో తెలుసని అయినా అతడిని చంపాలని అనుకోవడం లేదని జూన్ 17న అమెరికా అధ్యక్షడుు ప్రకటించారు. ఇజ్రాయిల్ యుద్ధం మొదలైన తర్వాత అండర్ గ్రౌండ్ కు పారిపోయిన ఖమేనీ నిన్న వీడియో రిలీజ్ చేశారు. జాతీయ మీడియా చానెల్ ఈ ప్రసంగాన్ని ప్రసారం చేసింది. ఇందులో ఆయన 10 నిమిషాలు మాట్లాడారు. ఖతార్ లోని అమెరికా స్థావరాలపై దాడి చేసి ఆ దేశాన్ని చెంప దెబ్బ కొట్టామని ప్రకటించారు.






