- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సోమవారం జరిపిన దాడిలో హిజ్‌బొల్లా సీనియర్ కమాండర్ మృతి చెందినట్టు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. సదరు మీడియా కథనం ప్రకారం, హిజ్‌బొల్లాలోని రాడ్వాన్ అనే దళానికి డిప్యూటీ హెడ్ అయిన విస్సామ్ అల్ తావిల్‌తోపాటు అదే సంస్థకు చెందిన మరో ఫైటర్ ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ మజ్దల్ సెల్మ్ అనే గ్రామం మీదుగా కారులో ప్రయాణిస్తుండగా, ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుండగా, దక్షిణ లెబనాన్‌లో ఇప్పటివరకు 130 మందికి పైగా హిజ్‌బుల్లా ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో మరో 19 మంది మృతిచెందారు. కాగా, హమాస్‌కు హిజ్‌బొల్లా సంస్థ మద్దతిస్తున్న విషయం తెలిసిందే.
Next Story






