ఇజ్రాయెల్ మంత్రివర్గం కీలక నిర్ణయం.. గాజాపై సైనిక నియంత్రణ కు ఆమోదం

by Malleboina Mahesh |

ఇజ్రాయెల్- హమాస్ మధ్య 2023 అక్టోబర్ నెలలో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్ మంత్రివర్గం కీలక నిర్ణయం.. గాజాపై సైనిక నియంత్రణ కు ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్- హమాస్ మధ్య 2023 అక్టోబర్ నెలలో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే హమాస్ (Hamas) పై యుద్ధంలో భాగంగా గాజాను ఇప్పటికే పూర్తిగా ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ (Israel) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గాజాను సైనిక నియంత్రణ (Military control of Gaza)లోకి తీసుకునే ప్రణాళికకు ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హమాస్‌ను "నిరాయుధీకరణ" చేయడం అనే ఐదు అంశాల లక్ష్యంలో భాగంగా గాజా నగరాన్ని సైనిక నియంత్రణలోకి తీసుకోవాలని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Prime Minister Benjamin Netanyahu) ప్రణాళిక సిద్ధం చేయగా.. ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆయన నిర్ణయాన్ని ఆమోదించింది.

అయితే ఈ నిర్ణయం ఎన్‌క్లేవ్‌లో దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో మరింత తీవ్రతరం అవుతుందనే భయాలను పెంచుతుంది. హమాస్ పై యుద్ధాన్ని వెంటనే ముగించాలని, బందీలుగా ఉన్న 50 మందిని వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్ అంతటా భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య గాజా నగరాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవాలనే ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story