లైవ్‌లో బాంబు దాడి.. భయంతో పరిగెత్తిన న్యూస్ రీడర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-16 13:46:27  IST  )

సిరియా (Syria) రాజధాని అయిన డమాస్కస్ (Damascus)లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం (Israel Army) దాడులు చేసింది.

లైవ్‌లో బాంబు దాడి.. భయంతో పరిగెత్తిన న్యూస్ రీడర్
X

దిశ, వెబ్‌డెస్క్: సిరియా (Syria) రాజధాని అయిన డమాస్కస్ (Damascus)లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం (Israel Army) దాడులు చేసింది. దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్.. తమ రక్షణశాఖ కార్యాలయం లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సిరియన్ సైనిక వర్గాలు సైతం ధృవీకరించాయి. స్వెయిదా ప్రాంతంలోని మిలీషియాల మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మైనార్టీ షియా తెగకు చెందిన ద్రూజ్.. మిలీషియాకు, సున్ని బెడ్విన్ తెగలకు మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది.

ద్రూజ్ జాతికి చెందిన కూరగాయల వ్యాపారిని కొందరు దోచుకోవడంతో సమస్య మొదలైందని అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. కాగా.. సిరియా రక్షణశాఖ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడిచేసిన సమయంలో ఒకఛానల్ లో లైవ్ లో వార్తలు చదువుతున్న యాంకర్ ఖంగుతింది. రక్షణశాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న న్యూస్ ఛానల్ లైవ్ లో వార్తలు చదువుతుండగానే వెనుక బాంబు దాడి జరగ్గా.. యాంకర్ భయంతో పరుగుతీసింది.

https://x.com/ignis_fatum/status/1945442785617756533

Next Story