హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యం.. లెబనాన్‌లో మరింత చొచ్చుకుపోయిన ఇజ్రాయెల్‌ సైన్యం

by Ramesh Naini |

హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. తాజాగా లెబనాన్ భూభాగంలోకి మరింత లోపలికి చొచ్చుకుపోయింది.

హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యం.. లెబనాన్‌లో మరింత చొచ్చుకుపోయిన ఇజ్రాయెల్‌ సైన్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. తాజాగా లెబనాన్ భూభాగంలోకి మరింత లోపలికి చొచ్చుకుపోయింది. ఇజ్రాయెల్ బలగాలు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు నుంచి సుమారు 6 కిలోమీటర్ల (3.7 మైళ్లు) మేర ముందుకు వెళ్లి, దక్షిణ లెబనాన్ పట్టణమైన 'ఖియామ్ (Khiam)'లోకి ప్రవేశించినట్లు లెబనీస్ స్టేట్ మీడియా వెల్లడించింది.

ప్రస్తుతం ఖియామ్ పట్టణంలో ఇజ్రాయెల్ సైన్యం నిరంతర ఆర్టిలరీ షెల్లింగ్‌తో భీకర దాడులకు పాల్పడుతోందని, శత్రు బలగాలు పట్టణంలోకి ప్రవేశించాయని స్థానిక మీడియా నివేదించింది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే, దానికి సమాంతరంగా ఇజ్రాయెల్ దళాలు సరిహద్దు ప్రాంతం గుండా ఈ దాడులకు (గ్రౌండ్ ఇన్‌కర్షన్) దిగినట్లు లెబనీస్ సైనిక వర్గాలు 'ఏఎఫ్‌పీ (AFP)' వార్తా సంస్థకు తెలిపాయి.

Next Story