- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బందీల విడుదలకు హమాస్ అంగీకారం.. దాడులతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్
గాజా యుద్ధానికి శాంతి దిశగా సంకేతాలు వెలువడుతున్న వేళ, ఇజ్రాయెల్ మరోసారి గాజాపై దాడులు చేసి యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది.

దిశ, వెబ్ డెస్క్: గాజా యుద్ధానికి శాంతి దిశగా సంకేతాలు వెలువడుతున్న వేళ, ఇజ్రాయెల్ మరోసారి గాజాపై దాడులు చేసి యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ట్రంప్ జోక్యంతో హమాస్ తాజాగా బందీల విడుదలకు అంగీకరించినప్పటికీ, గాజా సిటీ, ఖాన్ యూనిస్ సహా అనేక ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో పలు గృహాలు ధ్వంసం కాగా, మహిళలు, పిల్లలు సహా నిరపరాధుల ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "గాజాపై బాంబింగ్ ఆపాలి" అని హెచ్చరించినప్పటికీ, ఇజ్రాయెల్ తన చర్యలను తీవ్రంగా కొనసాగిస్తోంది.
శాంతి స్థాపన అవుతుందని భావిస్తున్న సమయంలో ఈ పరిణామం అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఒకవైపు హమాస్ శాంతి ప్రణాళికలోని 20 అంశాలకు మద్దతు తెలుపుతూ, గాజా పరిపాలనను పాలస్తీనా టెక్నోక్రాట్లకు అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం “జాతీయ భద్రత” పేరుతో దాడులను కొనసాగించడం గాజా సమస్య పరిష్కారం మరింత క్లిష్టం చేస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శాశ్వత యుద్ధ విరమణ దిశగా కదులుతున్న ప్రణాళికకు ఈ వైమానిక దాడులు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






