మరోసారి భారీ మెరుపు దాడి.. 66 మంది మృతి

by Malleboina Mahesh |

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో భాగంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపదింది.

మరోసారి భారీ మెరుపు దాడి.. 66 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో భాగంగా గాజా స్ట్రిప్‌(Gaza Strip)పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపదింది. ఈ దాడుల్లో కనీసం 66 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని గాజాలోని ఆసుపత్రులు, వైద్య సిబ్బంది తెలిపారు. ఈ దాడులు శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగాయి. ఈ దాడులు గాజా స్ట్రిప్ అంతటా, ముఖ్యంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక, నౌకాదళం, భూ దళాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయని తెలుస్తోంది. అలాగే ఈ దాడులు గాజాలోని శిబిరాలు, గృహాలు, ఇతర పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని జరిగాయని పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు.

ముఖ్యంగా, టెంట్ శిబిరాలపై జరిగిన దాడిలో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి 2023 అక్టోబర్ 7న ప్రారంభం అయిన ఈ వార్ ఇరు ప్రాంతాల మధ్య నేటికి కొనసాగుతూనే ఉంది. హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత ఈ సంఘర్షణ మరింత తీవ్రమైంది, ఆ దాడిలో 1,218 మంది మరణించారు. కాగా గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 55,000 మంది మరణించారు. ఈ సంఖ్యలో సుమారు మూడవ వంతు..అంటే 18,000 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు.

Next Story