నెక్స్ట్ టార్గెట్ మీరే..ఆ దేశాలకు ఇజ్రాయెల్ వార్నింగ్

by Ajay Maddhiboyina |

ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మ‌ధ్య య‌ద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇరాన్ అణుస్థావ‌రాలే ల‌క్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. మ‌రోవైపు ఇజ్రాయెల్ ఐర‌న్ డోన్ సిస్ట‌మ్‌ను చేదించి ఇరాన్ ఆ

నెక్స్ట్ టార్గెట్ మీరే..ఆ దేశాలకు ఇజ్రాయెల్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మ‌ధ్య య‌ద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇరాన్ అణుస్థావ‌రాలే ల‌క్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. మ‌రోవైపు ఇజ్రాయెల్ ఐర‌న్ డోన్ సిస్ట‌మ్‌ను చేదించి ఇరాన్ ఆ దేశంలోని ప్రధాన నగరాలపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే తాజాగా ప్రపంచ దేశాలకు సైతం ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వీడియోను విడుదల చేశాయి. మేం వారిని ఆపకపోతే నెక్స్ట్ టార్గెట్ మీరే కావచ్చు అంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తే యూఎస్, యూకే, రష్యా, ఇటలీ, హంగేరీ, కజకిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, చైనా, సౌదీ, కెనడా, ఈజిప్ట్, స్వీడన్, జర్మనీ, రొమేనియా, పోలండ్, ఆస్ట్రియా, లిథువేనియా, ఉక్రెయిన్ దేశాలు సైతం ధ్వంసం చేస్తుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరించింది.

Next Story