Israel Vs Iran : ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్.. హై టెన్షన్!

by Disha Web Desk 4 |
Israel Vs Iran : ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్.. హై టెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ శుక్రవారం దాడులు ప్రారంభించడం తీవ్ర కలకలం రేపింది. రెండు ప్రధాన శత్రు దేశాల మధ్య దశాబ్ధాలుగా ఉద్రిక్తత కొనసాగుతుండగా దాడులతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ మీడియా పేలుళ్లపై స్పందిస్తూ.. అవి వాయు రక్షణ వ్యవస్థ వల్ల సంభవించాయని తెలిపింది. సెంట్రల్ సిటీ ఇస్పహాన్ పై మూడు డ్రోన్‌లను కూల్చివేసినట్లు మీడియా తెలిపింది. అయితే ఇజ్రాయెల్ నాయకత్వం, మిలిటరీ బలగాలు శుక్రవారం ఘటనపై స్పందించలేదు. ఇజ్రాయెల్ దాడికి ముందు అమెరికాకు సమాచారం అందినట్లు తెలిసింది. ఇరాన్ ఇజ్రాయెల్‌పై డ్రోన్‌లతో మిసైల్ దాడులు చేసిన కొన్ని రోజులు తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఏప్రిల్ 1న డమస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయ సముదాయంపై జరిగిన వైమానిక దాడి తర్వాత హింసాత్మక ఘటనలు చెలరేగకుండా స్పందించవద్దని, తదుపరి ప్రతీకార దాడులను పరిమితం చేయాలని ఇజ్రాయెల్‌ను అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలు కోరాయి.

Next Story

Most Viewed