ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ప్రధాని కొడుకు పెళ్లి వాయిదా!

by Ajay Maddhiboyina |

ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక దేశంపై మరో దేశం క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ప్రధాని కొడుకు పెళ్లి వాయిదా!
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక దేశంపై మరో దేశం క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. గత మూడు రోజుల నుండి ఇరాన్ అణు స్థావరాలు, సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే అణుశాస్త్రవేత్తలు చనిపోయారు. ఈ దాడుల్లో దాదాపు 80 మంది మరణించగా 300 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇక ఇరాన్ కూడా క్షిపణులు డ్రోన్లతో ప్రతిదాడులు చేస్తోంది.

ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరాలు జెరూసలేం, టెల్ అవీవ్‌లో ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. రెండు దేశాల మధ్య ఉధ్రిక్త వాతావరణం నెలకొనడంతో ప్రజలు వణికిపోతున్నారు. అయితే ఓ వైపు యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కుమారుడు అవ్ నెర్ వివాహం నిశ్చయించుకున్నారు. సోమవారం అతడి వివాహం జరగాల్సి ఉంది. కానీ రెండు దేశంలో భయాందోళన పరిస్థితులు కనిపిస్తుంటే ప్రధాని ఇంట్లో వివాహం ఏంటి అని విమర్శలు వచ్చాయి. దీంతో కుమారుడి పెళ్లిని నేత న్యాహు వాయిదా వేసుకున్నారు.

Next Story