ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

by velandi.Saikiran |

ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది.

ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ ( Iran) వర్సెస్ ఇజ్రాయెల్ ( Israel) దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా వెనక్కి తగ్గినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. తాజాగా ఎయిర్ స్ట్రైక్స్ లో ఇరాన్ లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అర్ధకాన్ యురేనియం ప్లాంట్స్ ను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్.

అణ్వాయుధుల‌ తయారీకి అవసరమైన కీలక ఇన్ఫ్రాను ధ్వంసం చేయడమే లక్ష్యం అని ఐడీఎఫ్ ప్రకటన చేసింది. ఈ దాడులలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రేడియేషన్ ముప్పు కూడా లేదని స్వయంగా ఇరాన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులకు గాను కచ్చితంగా ప్రతి కారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.

Next Story