- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం: భారీగా ఆర్థికభారం.. నెలకు ఎన్ని లక్షల కోట్లంటే..
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం (Israel - Iran War) తొమ్మిదో రోజుకు చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం (Israel - Iran War) తొమ్మిదో రోజుకు చేరింది. టెల్ అవీవ్ (Tel Aviv) నుంచి టెహ్రాన్ (Tehran)లోని ముఖ్యమైన సైనిక స్థావరాలు, అణు సదుపాయాలపై తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఇరాన్ కూడా ధీటుగా ప్రతిచర్యలు చేపడుతోంది. ఈ పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ఇరు దేశాలపై గణనీయమైన ఆర్థిక భారం పడుతోంది.
ఆర్థిక విధానాలపై పరిశోధనలు చేసే ఆరోన్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. ఇజ్రాయెల్‌కు నెలవారీగా సుమారు 12 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు) యుద్ధానికి ఖర్చవుతోంది. యుద్ధ ప్రారంభంలోనే రెండు రోజుల్లో దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఖర్చైనట్లు సమాచారం. ఇందులో దాడులు, రక్షణ చర్యల ఖర్చు వున్నాయి. ఇజ్రాయెల్ సైనిక చర్యల కోసం రోజుకు సగటుగా 2.75 బిలియన్ షెకెల్స్ లేదా 725 మిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. ఇరాన్ దాడుల వల్ల తలెత్తిన నష్టాలను తిరిగి పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్‌కి కనీసం 400 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి రోజూ జెట్ ఇంధనం, ఆయుధాలపై 300 మిలియన్ డాలర్లు ఖర్చవుతోందని అంచనా. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఇరాన్ క్షిపణుల దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ రోజుకు సుమారు 200 మిలియన్ డాలర్ల వ్యయం చేస్తోంది.
ఇరాన్ కూడా ఈ యుద్ధంతో ఆర్థికంగా భారీగా నష్టపోతోంది. ముఖ్యంగా ఇంధన ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కెప్లెర్ డేటా ప్రకారం.. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులు 2.42 లక్షల బ్యారెల్ల నుంచి 1.02 లక్షల బ్యారెల్లకు (జూన్ 15 నాటికి) పడిపోయాయి. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ప్రపంచంలో అతిపెద్ద సహజ వాయు కేంద్రాల్లో ఒకటైన 'సౌత్ పార్స్' తీవ్రంగా దెబ్బతింది. ఇది ఇరాన్ గ్యాస్ ఎగుమతుల్లో 80 శాతం వాటా కలిగిన కేంద్రం. దాడుల కారణంగా ఈ కేంద్రంలో ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచింది.






