ఇరాన్ లో యూరేనియం జాడ ఏదీ?

by Shamantha N |

ఇరాన్ లోని నజాంత్, పోర్డ్ లాంటి అణ్వస్త్ర కేంద్రాలపై అమెరికా బంకర్ బ్లస్టర్ బాంబులతో విరుచుకుపడిన న్యూక్లియర్ లీక్ కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇరాన్ లో యూరేనియం జాడ ఏదీ?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ లోని నజాంత్, పోర్డ్ లాంటి అణ్వస్త్ర కేంద్రాలపై అమెరికా బంకర్ బ్లస్టర్ బాంబులతో విరుచుకుపడిన న్యూక్లియర్ లీక్ కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ శుద్ధి చేసిన యూరేనియంను రహస్య ప్రాంతాలకు తరలించిందని తెలుస్తోంది. దాదాపు 400 కేజీల యూరేనియంను గుట్టు చప్పుడు కాకుండా యుద్ధ సమయంలో జూన్ 19నే తరలించినట్లు తెలుస్తోంది. ఎన్ని దాడులు చేసినా అణ్వస్త్ర కార్యక్రమాలు ఆపేది లేదని ఇరాన్ చెబుతుండగా ఇప్పట్లో న్యూక్లియర్ బాంబ్స్ తయారీ చేయకుండా దాడులు చేశామని అమెరికా చెబుతోంది.

అసలు యూరేనియం ఎక్కడ?

ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడికి ప్రధాన కారణం అణ్వస్త్ర బాంబు తయారీ చివరి దశలో ఉందని ఆ దేశ ఇంటిలిజెన్స్ వర్గాలు తెలపడమే అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇరాన్ పక్కా ప్లాన్ తో శుద్ది చేసిన యూరేనియం నిల్వల్ని రహస్య ప్రాంతాలకు తరలించింది. యూరేనియంను ఇరాన్ ఎక్కడ దాచిందో తమకు తెలుసని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు చెబుతున్నారు. శుద్ధి చేసిన యూరేనియంతో ఏకంగా 10 అణు బాంబుల వరకు తయారు చేయొచ్చని అంటున్నారు. దీంతో పాటు 300 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ తయారు చేస్తోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తుంది. అమెరికా ఇస్పహాన్ అణు పరిశోధన కేంద్రంపై దాడులు చేయలేదు. కేవలం నతాంజ్, ఫోర్డ్ లపై దాడులు చేసింది. బంకర్ బ్లస్టర్ బాంబులతో విరుచుకుపడింది. కానీ ఇస్ఫహాన్ న్యూక్లియర్ ప్లాంట్ లోనే 60 శాతంపైగా యూరేనియం శుద్ధి చేస్తున్నారని దాన్ని మాత్రం అమెరికా విడిచిపెట్టిందని తెలుస్తోంది. ఇక్కడ దాడి చేయకపోతే అమెరికా చేసిన దాడులు నామమాత్రంగానే మిగిలిపోతాయని ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలను అడ్డుకోనట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్ని దాడులు జరుగుతున్న ఇరాన్ మాత్రం కచ్చితంగా అణ్వస్త్రాల తయారీని ఆపేది లేదని చెబుతోంది.

Next Story